
విద్యార్థులకు అభినందనలు
మహబూబ్‌నగర్ టౌన్, నవంబర్ 5 : నీట్ (యూజీ)-2021 పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని రిషి మెడికల్ అ కాడమీ విద్యార్థులు సత్తాచాటిన విషయం తెలిసిందే. పి. కౌషిక్-594, బి.సుమోధ-569, కె.సాయివైష్ణవి-560, సానియాభాను నితాని-558, వి.ప్రశాంత్‌రెడ్డి-555, జి. కళ్యాణ్‌కుమార్-545, సాయికిరణ్‌రెడ్డి-545, ఎం.అభిలాష్‌గౌడ్-544, అయోషా ఫాతిమా-541, కీర్తన బావాజీ-541, ఏ.లిఖిత-541, సబతబ్సుమ్-540 మార్కులు సా ధించారు. 500లకుపైగా 37 మంది, 450కుపైగా 74 మం ది, 400కుపైగా 125 మంది మార్కులు పొంది 100 మం దికిపైగా ఎంబీబీఎస్ సీట్స్ సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. శుక్రవారం విద్యార్థులను మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీ నివాస్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. కా ర్యక్రమంలో రిషి మెడికల్ ఐఐటీ అకాడమీ చైర్మన్ చంద్రకళ, సలహాదారుడు వెంకటయ్య, అధ్యాపకులు, విద్యార్థు లు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభ మెడికల్ అకాడమీ విద్యార్థులు
నవంబర్ 1న ప్రకటించిన నీట్(యూజీ)-2021 పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ మెడికల్ అకాడమీ వి ద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఎం.చందనరెడ్డి-720, కె. సహితి-720, డి.మహేశ్-720, గోపిక-720 మార్కులతోపాటు 500లకుపైగా మార్కులు సాధించారు. విద్యార్థులను శుక్రవారం జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ త న నివాసంలో అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీట్లో ప్రతిభ విద్యార్థులు ర్యాంకులు సాధించడం అభినందనీయమని, మంచిగా చదువుకోని ఉన్నత శిఖరాలకు ఎదుగాలని ఆకాక్షించారు. 55 మెడికల్ సీట్లు సాధించడం సంతోషంగా ఉం దన్నారు. కార్యక్రమంలో అకాడమీ విద్యార్థులు, కళాశాల గౌరవ సలహాదారులు మంజూలదేవి, వి.లక్ష్మారెడ్డి, కె.వి ష్ణువర్ధన్రెడ్డి, కె.జనార్దన్‌రెడ్డి, జి.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపా ల్స్ వెంకటరామయ్య, వి.మాధవి, కృష్ణయ్య పాల్గొన్నారు.