రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి
గ్రామాల్లో అవగాహన కల్పించిన అధికారులు
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 3 : రైతులు ఇతర పంటలపై దృష్టి సారించాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, మున్సిపల్ కన్వీనర్ బూడిద నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం రైతుబంధు సమితి క్యాలెండర్‌ను ఉప్పరిగూడ రైతువేదికలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి, నర్సింహారెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచిం చారు. కార్యక్రమంలో ఏఈవో రఘు, రైతులు సత్తిరెడ్డి, యాదగిరిరెడ్డి, నర్సింహయాదవ్, గోపాల్, వాసుదేవరెడ్డి, సత్తిరెడ్డి, పర్వతాలు, వెంకట్‌రెడ్డి, జంగయ్య పాల్గొన్నారు.
ఆరుతడి పంటలు సాగుచేస్తే మద్దతు
ఆమనగల్లు, డిసెంబర్ 3 : రైతులు ఇతర పంటలు సాగుచేయాలని ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో రైతులతో సమావేశం నిర్వహించి, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించారు. వరి పంట పండిస్తే భవిష్యత్‌లో కలిగే లాభాల గురించి వివరించారు. సీఎం కేసీఆర్ రైతులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటారన్నారు. కేంద్ర ప్రభు త్వం రైతులను ఇబ్బందులను గురిచేసేందుకు రోజుకో మాట మాట్లాడుతుందని ఆయన విమర్శించారు. అనంతరం ఆరుతడి పంటల సాగుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
పంటల సాగుపై అవగాహన
కేశంపేట, డిసెంబర్ 3 : రైతులు ఆరుతడి పంటలు సాగు చేసి లాభాలను ఆర్జించాలని ఏవో శిరీష సూచించారు. శుక్రవారం మండలంలోని సంగెంలో రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించారు. అనంతరం ఆరుతడి పంటల సాగుతో కలిగే లాభాల వాల్‌పోస్టర్‌ను ఏవో రైతులతో కలిసి విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఈవో విన య్, రైతులు జంగయ్య, శ్రీను, శేఖర్, భూపాల్, కృష్ణయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
కొత్తూరు మండలంలో..
కొత్తూరు రూరల్, డిసెంబర్ 3: మండలంలోని తీగాపూర్, ఇన్ముల్‌నర్వ గ్రామాల్లో శుక్రవారం మండల వ్యవసాయశాఖ అధికారి గోపాల్ ఆధ్వర్యంలో తీగాపూర్, ఇన్ముల్‌నర్వ సర్పంచ్‌లు రమాదేవీరమేశ్, అజయ్‌నాయక్ అధ్యక్షతన ఆరుతడి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మంజుల, ఏఈవోలు దీపిక, సన, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
శంకర్పల్లి మండలంలో..
శంకర్పల్లి, డిసెంబర్ 3 : రైతులు యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని మం డల వ్యవసాయాధికారి సురేశ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గోపులారం, మహాలింగపురం, అం తప్పగూడ, ఎర్వగూడ, ఆలంఖాన్‌గూడ, గ్రామాల్లో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించి, వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్, గోవర్ధన్‌రెడ్డి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
మొయినాబాద్ మండలంలో..
మొయినాబాద్, డిసెంబర్ 3 : రైతులు ఇతర పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి రాగమ్మ అన్నారు. ఎతుబార్పల్లిలో ఇతర పంటల సాగుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను సర్పంచ్ నవనీతతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఈవో కుమార్ పాల్గొన్నారు.