షాద్‌నగర్, నవంబర్ 3 : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ఓ వరంగా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రాత్రి షాద్‌నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. పట్టణానికి చెందిన శ్రీనివాసరావుకు రూ. 60 వేలు, చీపిరి సత్యనారాయణ యాదవ్‌కు రూ. 22 వేలు, స్వాతికి రూ. 56 వేలు, సయ్యద్ సాజిద్‌కు రూ. 60 వేలు, మనోహర్రాజుకు రూ. 60 వేలు, గఫార్‌కు రూ. 26 వేల చెక్కులను అందజేశామని చెప్పారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 3 : బాటసింగారం రైతు సేవా సహకార సంఘ సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందజేస్తున్నామని చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు ఆవుల పెంటమ్మ మృతి చెందారు. ఆమె కుటుంబానికి బుధవారం సంఘ ప్రధాన కార్యాలయంలో రూ. 15వేల చెక్కును చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి సహకార సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మేకల రాములు, మొగుళ్ల యాదిరెడ్డి, గంటా శ్రీనివాస్‌రెడ్డి, కందాడ మహిపాల్‌రెడ్డి, మేనేజర్ జక్కుల ఐలేశ్ ఉన్నారు.