
పెద్దశంకరంపేట, నవంబర్ 3 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సూచించారు. బుధవారం పీఎసీఎస్ ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట, జంబికుంట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, కమలాపురం, బుజ్రాన్‌పల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు వరి పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పీఎసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, ఐకేపీ ఏపీఎం గోపాల్, సర్పంచ్ సత్యనారాయణ, రైతుబంధు మండల అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, మాణిక్‌రెడ్డి, సీఈవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..
రామాయంపేట, నవంబర్ 3 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, పీఏఎస్ చైర్మన్ బాదె చంద్రం సూచించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని ఎస్సీ కాలనీ, కోమటిపల్లి, గొల్పర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వరికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1960 ప్రకటించిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరిరెడ్డి, ఏవో రాజ్‌నారాయణ, కమిషనర్ శ్రీనివాసన్, సీఈవో పుట్టి నర్సింహులు, మున్సిపల్ కౌన్సిలర్లు యాదగిరి, గంగాధర్, అనిల్, సుందర్‌సింగ్, పీఏసీఎస్ డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు కొండల్‌రెడ్డి, నర్సింహులు, రాజు, రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఆదుకునేందుకే కొనుగోలు కేంద్రాలు
వెల్దుర్తి, నవంబర్ 3 : రైతులను ఆదుకునేందుకే ప్రభు త్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్ అన్నా రు. మంగళవారం వెల్దుర్తి మండలం శెట్పల్లి, బండపోసాన్‌పల్లి, ఏదులపల్లి, ఉప్పులింగాపూర్, మాసాయిపేట మం డలం కొప్పులపల్లి, బొమ్మారం, నాగ్సాన్పల్లి గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లత, నరేందర్‌రెడ్డి, భూమయ్య, శంకర్, ఎంపీటీసీలు, నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మైస య్య, వెంకట్‌రెడ్డి, ఖాజా, సొసైటీ సీఈవో సిద్ధయ్య, రైతులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
నిజాంపేట, నవంబర్ 3 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు సూచించారు. బుధవారం మండలంలోని రాంపూర్, నస్కల్, నగరం గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. మరోవైపు చల్మెడలోని తిరుమలనాథ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీ బాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్ ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జైరాములు, ఏవో సతీశ్, ఏఈవో గణేశ్‌కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, సర్పంచ్‌లు కవిత, గేమ్‌సింగ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హవేళీఘనపూర్‌లో..
హవేళీఘనపూర్, నవంబర్ 1 : మండల పరిధిలోని స్కూల్ తండా పంచాయతీ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ హన్మంతరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సాయిలు, మండల కో-ఆప్షన్ సభ్యులు ఖలీద్, ఎంపీటీసీ మంగ్యా, రైతులు పాల్గొన్నారు.