
పాల్వంచ, అక్టోబర్ 3: దేశ వ్యాప్తంగా విద్యుదుత్పత్తి కేంద్రాలన్నింటి కంటే కేటీపీఎస్ 7వ దశ కర్మాగారం 87.18 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేసి అగ్రగామిగా నిలిచిన సందర్భంగా టీఆర్వీకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం సంబురాలు నిర్వహించారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, జెన్కో కార్యదర్శి చారుగుండ్ల రమేశ్ ఆధ్వర్యంలో కేటీపీఎస్ 7వ దశ సీఈ పాలకుర్తి వెంకటేశ్వరరావును సన్మానించారు. కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. 7వ దశలో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గుర్రం రాజ్‌కుమార్‌ను అభినందించారు. కేటీపీఎస్ ఏడో దశ దేశంలో మొట్టమొదటి స్థానంలో నిలవడం కోసం కృషి చేసిన కార్మికులకు, ఉద్యోగులకు, అధికారులకు, ఆర్టీజన్లకు అభినందనలు తెలిపారు. యూనియన్ నాయకులు తోట కోటేశ్వరరావు, ముత్యాల రాంబాబు, కోటిలింగం, దంచనాల రాంబాబు, ఆర్.శ్రీనివాస్, సాదిక్ పాషా, కట్టా మల్లికార్జున్, నారందాసు వెంకటేశ్వర్లు, మేరెడ్డి వేమారెడ్డి, కాలువ రవికుమార్ యాదవ్, ఎండీ అమీన్, పోతురాజు ప్రవీణ్, వై.ప్రవీణ్ పాల్గొన్నారు.
సీఈకి అభినందన..
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ 142 ఆధ్వర్యంలో ఆదివారం సీఈ వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించి అభినందించారు. జాతీయస్థాయిలో అధిక పీఎల్ఎఫ్ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాసాచారి, తిప్పారపు రమేశ్, మధు, రాము పాల్గొన్నారు.