పరిగి టౌన్, అక్టోబర్ 2 : మహాత్మాగాంధీ జయంతిని పరిగిలోని గాంధీచౌక్ వద్ద గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కరణం అరవింద్‌రావు, జడ్పీటీసీ హరిప్రియారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, టీఆర్ఎస్ పరిగి మండల అధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు వేముల కిరణ్, కృష్ణ, వెంకటేష్, రవీంద్ర, నాగేశ్వర్, మునీర్, కోఆప్షన్ సభ్యుడు శేఖర్, జేఏసీ నాయకుడు రవికుమార్ పాల్గొన్నారు.
పీఆర్టీయూ ఆధ్వర్యంలో..
పీఆర్టీయూ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, ఎంఈవో హరిశ్చందర్, పరిగి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీశైలం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొడంగల్..
కొడంగల్, అక్టోబర్ 2 : కొడంగల్ మున్సిపాలిటీ, మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో గాంధీజీకి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘన నివాళులర్పించారు. శనివారం పట్టణంలోని తాసిల్దార్, మున్సిపల్, ఎంపీడీవో, తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వడ్డర్‌గల్లి చితారు పెరుమాళ్ల దేవాలయ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. మండలంలోని హస్నాబాద్, రుద్రారం, అన్నారం, అంగడిరైచూర్, పర్సాపూర్ తదితర గ్రామాల్లో గాంధీజీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి తాసిల్దార్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సర్పంచ్‌లు సయ్యద్ అంజద్, పకీరప్ప, అనిత, పట్లోళ్ల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేట మండల కార్యాలయంలో..
బొంరాస్‌పేట, అక్టోబరు 2 : మండల కార్యాలయ ఆవరణ, అంగన్వాడీ కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నాయకులు గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
మహాత్మాగాంధీకి బీసీ కమిషన్ సభ్యుడి ఘన నివాళి
వికారాబాద్, అక్టోబర్ 2 : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద గాంధీజీ విగ్రహానికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఎన్.శుభప్రద్‌పటేల్ నివాళులర్పించారు.
ఎస్పీ కార్యాలయంలో..
వికారాబాద్, అక్టోబర్ 2 : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ పోలీస్ అధికారులతో కలిసి గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ ఎం.ఏ రషీద్, ఏఆర్డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్బీ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సీ.సీఎస్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
మర్పల్లిలో
మర్పల్లి, అక్టోబర్ 2 : మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతిని జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్తో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు సొహెల్, ఎంపీటీసీ సంగీతవసంత్, నాయకులు రమేశ్మిత్ర, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో..
దౌల్తాబాద్, అక్టోబర్ 2 : మండల కేంద్రంలోని ఎంపీడీవో, తాసిల్దార్ కార్యాలయం, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గాంధీ పార్కులో..
వికారాబాద్, అక్టోబర్ 2 : వికారాబాద్‌లోని గాంధీ పార్కులో గాంధీ చిత్రపటానికి పీఆర్టీయూ టీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు సి.నర్సింహులు నివాళులర్పించారు. వికారాబాద్ ప్రధాన కార్యదర్శి కె.బాబ్యనాయక్, రాష్ట్ర బాధ్యులు రమేశ్షిండే, కృష్టారెడ్డి, మారుతి, అంజిరెడ్డి, ధారూరు మండల అధ్యక్షుడు శ్రీనివాస్, బంట్వారం అధ్యక్షుడు సతీశ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, వెంకటయ్య, యాదయ్య పాల్గొన్నారు.
మోమిన్‌పేట్ మండలంలో..
మోమిన్‌పేట్, అక్టోబరు 2 : మండల పరిధిలోని మోమిన్‌పేట్, ఎంకతల, చిమలదరి, టేకులపల్లి, రాళ్లగుడుపల్లి గ్రామాల్లో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో శ్రమదానం
ధారూరు, అక్టోబరు 2: మండల పరిధిలోని ధారూరు, మోమిన్‌కలాన్, అంతారం, మైలారం, దోర్నాల్, నాగారం, తరిగోపుల, కెరెళ్లి, కొండాపూర్ కలాన్, నాగసముందర్ తదితర గ్రామాల్లో గాంధీ జయంతిని నిర్వహించారు. కెరెళ్లి గ్రామ పంచాయతీ ఎదుట శ్రమదానం చేశారు. మోమిన్‌కలాన్ గ్రామంలో చెత్తాచెదారాన్ని తొలగించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
బంగరంపల్లిలో గాంధీజీ విగ్రహం ఆవిష్కరణ
కులకచర్ల, అక్టోబర్ 2 : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామ పంచాయతీ, యువజన సంఘాల ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. చౌడాపూర్ మండల పరిధిలోని బంగరంపల్లి గ్రామంలోని గాంధీజీ విగ్రహాన్ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రారంభించారు.
బంట్వారంలో..
బంట్వారం, అక్టోబర్ 2 : మండల పరిధిలోని బస్వపూర్, తొరుమామిడి, బొపునారం, రొంపల్లి, యాచారం గ్రామాల్లో గాంధీ జయంతిని నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ అధ్యక్షతన గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాండూరు నియోజకవర్గంలో
తాండూరు, అక్టోబర్ 2: తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో మహాత్మాగాంధీ విగ్రహానికి, చిత్రపటాలకు రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సేవా సమితి ప్రతినిధులు నివాళులర్పించారు. తాండూరు పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నేతలు నివాళులర్పించారు. మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
గుంతబాసుపల్లిలో
తాండూరు రూరల్, అక్టోబరు 2 : తాండూరు మండలంలోని కరణ్‌కోట గ్రామంలో ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. గుంతబాసుపల్లి సర్పంచ్ జగదీష్ పంచాయతీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. అంతారం, గౌతాపూర్, చెంగోల్, బెల్కటూర్, చిట్టిఘణాపూర్ గ్రామాల్లో గాంధీజయంతిని ఘనంగా నిర్వహించారు.
కోట్‌పల్లి మండల కేంద్రంలో
కోట్‌పల్లి, అక్టోబర్ 2 : కోట్‌పల్లి మండల కేంద్రంలో సర్పంచ్ నక్కల విజయలక్ష్మి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ గొడ్డలి మల్లయ్య, ఒగులాపూర్ శోభారాణిరాములు, ఎన్నారంలో సావిత్రిదశరథ్గౌడ్, ఆయా గ్రామాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయాల ఎదుట మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి మహేందర్, లక్కాకుల మల్లేశం, మత్స్యశాఖ మండల అధ్యక్షుడు రావిరాల ఆనంద్, పాండు, అంజయ్య, దినేశ్‌కుమార్, ఒగులాపూర్ రాములు, మల్లయ్య, సర్వర్, మల్లేశం, రమేశ్ పాల్గొన్నారు.
దోమ గ్రామ పంచాయతీలో..
దోమ, అక్టోబర్ 2 : మండల పరిధిలోని దోమ గ్రామ పంచాయతీలో గాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్ రాజిరెడ్డి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ సభలో నిర్ణయించిన సమస్యల పరిష్కారం, చేపట్టిన అభివృద్ధి పనులు, చేయాల్సిన పనుల గురించి చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్యగౌడ్, విష్ణువర్దన్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పెద్దేముల్, అక్టోబర్ 2 : మండల పరిధిలోని గాజీపూర్, ఖానాపూర్, మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ, ఎంపీడీవో కార్యాలయం, తదితర ప్రాంతాల్లో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.