తాండూరు, ఆగస్టు 2: తాండూరు నియోకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండలాల్లో గ్రామ దేవ తలకు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వార్డు లు, పల్లెలు బంధువుల రాకతో జనసంద్రమయ్యాయి. బోనాలతో తరలి వచ్చిన మహిళలు, భక్తులతో దేవాలయాలు సందడిగా మారాయి. ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పురప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
వికారాబాద్‌లో..
వికారాబాద్, ఆగస్టు 2 : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామ య్య గూడ, ఎన్నెపల్లి తదితర కాలనీల్లో బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతలైన పోచమ్మతల్లికి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలతో అమ్మవారికి ఊరేగింపుగా బయలు దేరారు. బోనాల ఊరే గింపులో డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని, ప్రజలందరూ సుఖసంతోషాలతో పాటు ఆరోగ్యవంతంగా ఉంటారని భక్తుల నమ్మకం. బోనాల ఊరేగింపులో వికారాబాద్ పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, కృష్ణ, ఆర్.నర్సింహులు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్‌లో..
కొడంగల్, ఆగస్టు 2: పర్సాపూర్ గ్రామంలో వెలసిన పోచమ్మతల్లికి గ్రామ స్తులు బోనం నైవేద్యాన్ని సమర్పించుకున్నారు. సర్వాంగ సుందరంగా అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని పోచ మ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పించుకొన్నారు.