పేదల ఆరోగ్య సంరక్షణకు చర్యలు
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అం దజేత
ఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 1 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన మంకాల లక్ష్మమ్మకి రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంగళవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్న పథకం ముఖ్యమంత్రి సహాయనిధి పథకం అని అన్నారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులు సీఎం సహాయనిధి కింద పేద ప్రజల వైద్యానికి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ల సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నీలం శ్వేత, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయం
ఆమనగల్లు : ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామానికి చెందిన కృష్ణయ్యకి రూ.19 వేలు, మండల కేంద్రానికి చెందిన పోశమ్మకి రూ.26 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదల ప్రజల సంక్షేమమే ధ్యేయమన్నారు.