హరితహారం, పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలి
మంత్రి సత్యవతిరాథోడ్
మహబూబాబాద్, జూన్ 30: నేషనల్ హైవే, ఆర్అండ్బీ రహదారులకు ఇరువైపులా ప్రణళికా బద్ధంగా ఏపుగా పెరిగే మొక్కలు నాటాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరా థోడ్ సూచించారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్లో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధ్యక్షతన పల్లె, పట్టణ ప్రగతి కార్య క్రమాల నిర్వహణపై సన్నాహక సభ నిర్వహించా రు. ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి హాజరై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం అని అన్నారు. హరిత హారం, పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో రిటై ర్డు ఉద్యోగులు, యువకులు, మహిళలను భాగ స్వాములను చేయాలని సూచించారు. ప్రతి వార్డు కు అంగన్వాడీ టీచర్, ఆశకార్యకర్తను ఇన్చార్జిగా నియమించి అభివృద్ధికి కార్యాచ రణను రూపొందించాలన్నారు. పోడు భూముల రైతులపై ఫారెస్టు అధికారులు దాడులు ఆపాలని, డిసెంబర్ 13, 2005 కంటే ముందు సాగు చేసుకుంటున్న రైతు లకు పట్టాలిప్పిం చేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు ఆరు విడుతల్లో హరితహారం కార్యక్రమం ద్వారా ఎన్ని మొక్కలు నాటారు? అందులో ఎన్ని బతికి ఉన్నాయి? జాబితా తయారుచేయాలని ఆదేశించారు. ఈ ఏడాది జిల్లాకు కేటాయించిన 60 లక్షల మొక్కలు నాటేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించా లన్నారు. దళితుల జీవితాల్లో వెలుగు నిపేందు కు రూ. 1200 కోట్లతో దళిత్ ఎంపవ ర్మెంట్ను ప్రభుత్వం చేపట్టిందని తెపారు. అధికార వికేంద్రీకరణతో తెలంగాణలోని పాలనను చరిత్రలో లిఖించవచ్చన్నారు. సీజ నల్ వ్యాధులు ప్రబలకుండా ధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. ఎంపీ కవిత మాట్లాడు తూ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం అధికారులు పనిచేసి పల్లె, పట్టణ ప్రగతితో అభివృద్ధిలో ముందుకెళ్లాల న్నారు. విద్యుత్ ప్రమాదాలు జిల్లాలో ఎక్కువగా జరుగుతు న్నాయని, అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మె ల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, హరిప్రి యానాయక్, డీఎఫ్‌వో రవికిరణ్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ట్రైనింగ్ ఐఏఎస్ అభిషేక్ అగస్త్య, ఏఎస్పీ యోగేష్ గౌతమ్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, ఆర్డీవో కొముర య్య, వ్యవసాయ అధికారి ఛత్రూనాయక్, డీపీవో రఘువరన్, జిల్లా వైద్యాధికారి హరీశ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.