జడ్చర్ల, ఏప్రిల్ 22 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మనఊరు-మనబడి, మనబస్తీ-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని ప్రాథమిక పాఠశాలలో ఆదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.29లక్షలతో పాఠశాలలో అదనపు గదులతోపాటు, ప్రహరీ, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, కిచెన్‌షెడ్, ఫర్నిచర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌మీడియం ప్రారంభించి మెరుగైన విద్య అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో ఉషారాణి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్, ఎంపీడీవో ఉమాదేవి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంఈవో మంజులాదేవి, కౌన్సిలర్లు రాజు, జ్యోతీకృష్ణారెడ్డి, లత, కోట్ల ప్రశాంత్‌రెడ్డి, రఘురాంగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, ఇర్షాఫన్, ఇమ్మూ, కృష్ణారెడ్డి, దోనూరు శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, ఏప్రిల్ 22 : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సౌజన్యంతో సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జడ్చర్లలోని పీఆర్టీయూ భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణాశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు.
మొదటగా నీళ్లు, నిధులతో అన్ని గ్రామాల్లో సమగ్రాభివృద్ధికి పా టుపడినట్లు తెలిపారు. అలాగే ప్రైవేట్ సెక్టార్లో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పెద్దఎత్తున నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఉద్యోగాల విషయంలో అనవసర రాద్దాంతం చేస్తూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలను సాధించాలని సూచించారు.
శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు భోజనవసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.మురళి, ముడా డైరెక్టర్లు శ్రీకాంత్, ప్రీతం, కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి, నాగిరెడ్డి, శివదర్శన్, పర్వత్‌రెడ్డి, శంకర్‌నాయక్, గిరియాదవ్, కాలేబ్ పాల్గొన్నారు.
బాలానగర్, ఏప్రిల్ 22 : క్రీడలతో మంచి గుర్తింపుతోపాటు శారీరక దృఢత్వం పొందుతారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని గుండేడ్‌లో రేణుకాదేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి బాలానగర్ మండలస్థాయి క్రికెట్ టోర్నీ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కిషన్‌గూడ జట్టుకు మొదటి బహుమతి రూ.35వేలు, అప్పాజీపల్లి జట్టుకు ద్వితీయ బహుమతి రూ.25వేల నగదు, ట్రోఫీలను అందజేశారు.
రాజాపూర్, ఏప్రిల్ 22 : టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, దోండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యురెడ్డి పుట్టినరోజు సందర్భంగా చించోడ్ రేణుకాదేవి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం మండలకేంద్రంలో ఇద్దరు దివ్యాంగులకు ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి చేతులమీదుగా స్కూటీలను పంపిణీ చేశారు. అనంతరం అభిమన్యురెడ్డితో కేక్ కట్టింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్‌నాయక్, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, రామకృష్ణాగౌ డ్, యాదగిరి, విజయ్, పుల్లారెడ్డి, వెంకటయ్యగౌడ్, హతీ రాం, సురేశ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.