ఆదిలాబాద్ రూరల్, మే 1 : దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలతో వారి జీవితాలను నాశనం చేసేందుకు కుట్ర పన్నిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పంజాబ్చౌరస్తాలో తెంగాణ కార్మిక హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఆదివారం చేసిన మే డే వేడుకల్లో ఆయన పాల్గొని జెండాఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోని అనేక పెద్ద పెద్ద ప్రభుత్వం రంగ సంస్థలను బీజేపీ సర్కారు ప్రైవేటుపరం చేస్తూ అందులోని కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నదన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ మే డే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్నదన్నారు.
అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ రాజలింగు, ఎంపీపీ గోవర్ధన్, బండారి సతీశ్, మేకల మధూకర్, హమాలీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఎదులాపురం, మే 1 : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. వారం రోజులుగా పరిసరాల పరిశుభ్రత చర్యలను చేపట్టారు. ఎమ్మెల్యే వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ జహిర్ రంజానీ, వార్డు కౌన్సిలర్ ప్రకాశ్, పట్టణ కార్యదర్శి అశ్రఫ్, కౌన్సిలర్లు సలీమ్, ఇమ్రాన్, కో ఆప్షన్ సభ్యుడు ఏజాజ్, నాయకులు అత్తర్ ఉల్లా, యూనిస్ అక్బానీ, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.