నేరడిగొండ, మే 1 : కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని జడ్పీటీసీ జాదవ్ అనిల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బస్టాప్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆయన జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, కార్మిక సంఘం మండలాధ్యక్షుడు గంగన్న, సర్పంచ్ పెంట వెంకటరమణ, మేస్త్రి సంఘం, ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
బోథ్, మే 1: మండల కేంద్రంలోని ఏఐటీయూసీ భవనంలో మండల ప్రధాన కార్యదర్శి గోదావరి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన్, కార్యవర్గ సభ్యుడు భోజన్న, నాయకులు ఎస్ దాస్, నరేశ్, భవన నిర్మాణ, బీడీ, విద్యార్థి, యువజన, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అలాగే సొనాలలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు శంకర్, అంగునూరి ఆశన్న, సాయి అశోక్, సంజీవ్, లక్ష్మణ్, సాయన్న పాల్గొన్నారు. బోథ్‌లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మజర్, ప్రభాకర్, ఆటో డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు.
సిరికొండ, మే 1: మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద కార్మిక సంఘం జెండాను భవన నిర్మాణ కార్మిక సంఘం మండలాధ్యక్షుడు షేక్ ఆలాం ఎగురవేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రవి, కార్యదర్శి గణేశ్, సభ్యులు శ్రీనివాస్, శేఖర్, మాజీ సర్పంచ్ పెంటన్న, ఉపసర్పంచ్ చందు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, మే 1 : మండల కేంద్రంలోని పాతబస్టాండ్ సమీపంలో పంచాయతీ కార్మికులతో కలిసి సీఐటీయూ మండలాధ్యక్షుడు మోత్కురి దేవేందర్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో కార్మికులు నర్సక్క, రాజు, నరేశ్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, మే 1 : మండల కేంద్రంలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ నిమ్మల శివ కుమార్ రెడ్డి, ఉపసర్పంచ్ శిరీష్‌రెడ్డి, సీఐటీయూ మండలాధ్యక్షుడు సుభాష్, కార్యదర్శి భూమయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు గంగయ్య, కార్మిక సంఘాల నాయకులు సురేశ్, లక్ష్మణ్, శంకర్, భీముడు, రమేశ్, భూమన్న, నారాయణ పాల్గొన్నారు.
తలమడుగు, మే 1 : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బ్లూభీం యువజన సంఘం, మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్మికులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు ప్రేమేందర్, ఎంపీటీసీ చంటి, నాయకులు, సభ్యులు గంగన్న, జువ్వాక నర్సింగ్, లింగాల చిన్నన్న, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.