నదులకు పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారు?
Pushkaralu | నదులకు పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తారు?
– డా.ఎమ్.సుధాకర్ రావు, నిజామాబాద్
మనుషులు నదుల్లో స్నానాలు చేసి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు. ఆ పాపాలను స్వీకరించడం వల్ల కలిగే బాధ నుంచి నదులకు విముక్తి కలిగించే ఉత్సవాలే పుష్కరాలు. పూర్వం పుష్కరుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. మనుషుల పాపాలను మోస్తున్న నదులను పునీతం చేసి, వాటి ఆవేదన తీర్చాల్సిందిగా ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడి అనుగ్రహంతో ఆ పాప ప్రాక్షళనలో పుష్కరుడే కీలకం అవుతాడు. ఆయన సాధించిన విజయమే పుష్కరోత్సవాలు. స్వర్గంలోని మందాకినీ నదిలో అంతర్లీనంగా ఉండే పుష్కరుడు ఏడాదికి ఒకసారి బృహస్పతి రాశి సంక్రమణం ఆధారంగా ఒక్కో నదిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ఆ నదికి పన్నెండు రోజులు ఉత్సవాలు చేస్తారు. వీటినే పుష్కరాలు అంటున్నారు.
పుష్కరోత్సవం జరుగుతున్న నదికి పదివేల నదుల ప్రవిత్రత ఏర్పడుతుందని మహాభారతంలోని అరణ్యపర్వం తెలియజేస్తుంది. పుష్కరాల వేళ నదీస్నానం చేసి దేవతలకు, రుషులకు, పితృదేవతలకు తర్పణాలు విడిచిన వారికి పది అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని ధర్మరాజుకు నారదుడు చెబుతాడు. అందుకే, పుష్కరాలల్లో పితృదేవతలకు విధిగా శ్రాధ్ధం నిర్వహించాలని శాస్త్రం నిర్దేశించింది.
– డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
…? కొమ్మెర రామమూర్తి
Read More :
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?
ఇంటి ముందు గుమ్మడి కాయ ఎందుకు కడతారు?
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?
కర్మ ఫలం అంటే ఏంటి? ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో అనుభవించాల్సిందేనా?
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

