తిరుమల : తిరుమలలో (Tirumala) పది రోజుల పాటు వైభవంగా కొనసాగిన వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikunta dwara darsan) ఆదివారంతో ముగుస్తున్నాయి. టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే టీటీడీ అధికారులు (TTD Officers) దర్శనబాగ్యం కల్పించారు. రేపటి నుంచి భక్తులకు సర్వదర్శనం ఉంటుందని అధికారులు వివరించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 75,931 మంది భక్తులు దర్శించుకోగా 25,717 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.40 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.