Tirumala | భక్తులతో నిండిపోయిన తిరుమల కంపార్టుమెంట్లు.. సర్వదర్శనానికి18 గంటల సమయం
Tirumala | తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగియనుండడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగియనుండడంతో తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. నిన్న స్వామివారిని 78,064 మంది భక్తులు దర్శించుకోగా 33,869 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.70 ఆదాయం వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
భక్తిసాగరంలో ముంచెత్తిన అయోధ్యకాండ అఖండ పారాయణం

లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం 11వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. అయోధ్యకాండలోని 40 నుంచి 44వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 159 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 184 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు డాక్టర్ రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, డాక్టర్ మారుతి శ్లోక పారాయణం చేశారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

