తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఏప్రిల్(April) నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఏప్రిల్ 5న అన్నమాచార్య వర్థంతి, 7న మాసశివరాత్రి, 8న సర్వ అమావాస్య, 9న క్రోధినామ సంవత్సర ఉగాది (Ugadi) , శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. 11న మత్స్యజయంతి, 17న శ్రీరామనవమి(Ugadi Sri Ramanavami) ఆస్థానం, 18న శ్రీరామపట్టాభిషేక ఆస్థానం, 19న సర్వ ఏకాదశి, 21 నుంచి 23వ తేదీ వరకు వసంతోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించినున్నామని పేర్కొన్నారు.