అడిగే పద్ధతి తెలియకే ఎన్నో విలువైనవి ఇవ్వకుండానే ఆగిపోతున్నాయి. అందుకే ప్రభువు ‘మీకు ఇవ్వనివి అడగండి’ అని సెలవిచ్చాడు. ఇంతకూ మనం వేదికే అంశం ఏమిటి? అది మన కోసమేనా? అందులో పరహితం ఏమైనా ఉందా? అనేది ప్రశ్న. అడిగినవి ఇవ్వకుంటే, వెదికినవి దొరకకపోతే, తట్టినప్పుడు తలుపు తీయకపోతే.. దూషించడం, నిరుత్సాహపడటం అవివేకం.
వెదికే విధానం తెలియకనే ఏ మూల దాగిన వస్తువు ఆ మూలనే దాగి పోతున్నాయి. అందుకే ‘వెదకండి.. మీకు దొరుకుతుంది’ అంటున్నాడు ప్రభువు. ఈ వెదుకులాట ఐహికం, స్వార్థం అయితే, ఎలా దొరుకుతాయి? మనిషి జీవితం సాధించుకోవడంతోనే సార్థకం అవుతుంది. ఆ సాధనలో పరుల హితం కూడా భాగమైతే మరింత రాణిస్తుంది. ప్రభువు నిర్దేశించినట్టు ప్రయత్నంతోనే ఫలితం సాధ్యమవుతుంది.
…? ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024