గర్భిణికి సీమంతం ఎందుకు చేస్తారు?
పూర్వ జన్మ పుణ్యం వల్ల సంక్రమించేదే ఈ మానవ జన్మం. దానికి చేయాల్సిన వాటిని షోడశ సంస్కారాలని అంటారు. అవి జనన పూర్వ సంస్కారాలు, జననాంతర సంస్కారాలని రెండు రకాలు. గర్భంలో ఉండగా పుట్టకముందే జరిపే సంస్కారాలలో ఈ సీమంతమనేది మూడోది. దీనికి మరో పేరే సీమంతోన్నయనం
గర్భిణికి సీమంతం ఎందుకు చేస్తారు?
– డి.ప్రదీప్ రామకృష్ణ. అల్వాల్
పూర్వ జన్మ పుణ్యం వల్ల సంక్రమించేదే ఈ మానవ జన్మం. దానికి చేయాల్సిన వాటిని షోడశ సంస్కారాలని అంటారు. అవి జనన పూర్వ సంస్కారాలు, జననాంతర సంస్కారాలని రెండు రకాలు. గర్భంలో ఉండగా పుట్టకముందే జరిపే సంస్కారాలలో ఈ సీమంతమనేది మూడోది. దీనికి మరో పేరే సీమంతోన్నయనం. అంతకుముందు జరిగే రెండు సంస్కారాలు గర్భాదానం, పుంసవనం. సీమంతమనేది కేవలం తొలిచూలప్పుడు, గర్భం దాల్చిన ఐదు గాని, ఆరు గాని, ఎనిమిదో నెల గానీ చేయాలని శాస్త్రం చెపుతున్నది. మిగతా పదమూడు సంస్కారాలు జీవితంలోని వేర్వేరు దశల్లో చేస్తారు.
సీమంతం తల్లి సౌభాగ్యాన్నీ, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షునూ కోరుతూ చేసేది. కడుపులో బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగాలనే ఆశయంతో ఈ వేడుక చేస్తారు. గర్భిణి శారీరకంగానూ, మానసికంగానూ ఉల్లాసంగా ఉండాలని కాంక్షిస్తూ దీనిని నిర్వహిస్తారు. ‘స్త్రీ సంస్కార రూపం సీమంతోన్నయనాఖ్యం కర్మచ తంత్రేణ కరిష్యే’ అనే సంకల్పంతో సీమంతం చేస్తారు.
బలమైన సంతాన సంపదను ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ మేడిపండ్లు, వనస్పతి వంటి పదార్థాలతో హోమం చేసే సంప్రదాయమూ ఉంది. గర్భదోషాలను తొలగింపజేసి, గర్భపోషణను అనుగ్రహించాలని హవ్యంతో ఉన్న పాత్రను చూపుతూ భర్తతోపాటు, గర్భిణి కూడా దేవతలను భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలని శాస్త్రం.
– డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
Read More :
Tambulam | ఏ సందర్భాల్లో తాంబూలాలు ఇస్తారు.. వాటి ప్రత్యేకత ఏంటి?
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?
ఇంటి ముందు గుమ్మడి కాయ ఎందుకు కడతారు?
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

