తిరుమల : గుంటూరుకు చెందిన డాక్టర్ అన్నం శ్రీనివాస్ శుక్రవారం టీటీడీకి చెందిన వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు ( Venkateswara Pranadana Trust ) కు రూ.15,00,116 విరాళంగా( Donations ) అందించారు. ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
ఔషధాలు విరాళం
హైదరాబాద్కు చెందిన ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తలశిల వేంకటేశ్వరరావు శుక్రవారం తిరుపతిలోని టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి రూ.7.50 లక్షల విలువైన ఔషధాలను విరాళంగా అందించారు. దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళాన్ని అందజేశారు.