తిరుమల : హైదరాబాద్కు చెందిన బండి సత్య నారాయణ ( Bandi Satyanarayana ) అనే భక్తుడు శనివారం టీటీడీ( TTD ) శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం ( Donation ) గా అందించారు. ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు.
తిరుమలలో ఆగస్టు 28l శ్రావణ పౌర్ణమిరోజున గరుడసేవను టీటీడీ ఘనంగా నిర్వహించ నుంది. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడవాహనంపై రాత్రి 7 నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారని టీటీడీ అధికారులు వివరించారు. ఈసారి తిరుమలలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగనున్నందును భక్తులకు అనుగుణంగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు.