తిరుమల : వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala )లో భక్తుల దర్శనం కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోగా అతిధి గెస్ట్‌హౌజ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarshanam ) అవుతుందని సంబంధిత అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 78,024 మంది భక్తులు దర్శించుకోగా 36,826 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.85 కోట్లు ఆదాయం ( Income ) వచ్చిందన్నారు.
కాగా గురువారం రిలయన్స్ సంస్థ ( Reliance ) ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్ ప్రసాద్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్లు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు.