Srisailatm Temple | రికార్డుస్థాయిలో శ్రీశైల మల్లన్న ఆదాయం..
Srisailam Temple | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గత 30 రోజుల్లో రూ.5,02,45,391 ఆదాయం

శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గత 30 రోజుల్లో రూ.5,02,45,391 ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి. శుక్రవారం ఉదయం నుంచి ఆలయ ప్రాకారంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉభయ దేవాలయాల హుండీలతోపాటు పరివార దేవతాలయాల హుండీలను అధికారుల సమక్షంలో శివసేవకులు, సిబ్బంది లెక్కించారు.

వీటితో పాటు 459 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 14 కిలోల 250 గ్రాముల వెండి, 370 యూఎన్ఏ డాలర్లు, 105 కెనడా డాలర్లు, 35 ఖతార్ రియాల్స్, 45 యూఏఈ దిర్హమ్స్, 5 ఎన్ఏయూ రియాల్స్, ఒక కువైట్ దినార్, ఒక జపాన్ యాన్ వీదేశీ కరెన్సీని భక్తులకు కానుకగా సమర్పించారని ఈవో చెప్పారు. కార్యక్రమంలో ఈవోతో పాటు ఈఈ మురళీ బాలకృష్ణ, ఏసీ నటరాజ్, భద్రతా అధికారి నర్సింహరెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్ కుమార్లతో పాటు అధికారులు పాల్గొన్నారు.
భ్రామరికి ప్రత్యేక పూజలు
భ్రమరాంబ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చక పండితులచే పంచామృతాభిషేకాలు పుష్పార్చనలు సర్కారీ సేవగా జరిపించినట్లు ఆయన చెప్పారు. అమ్మవారి ప్రాకార మండపంలో గులాబి నందివర్ధనం, చామంతి బంతి వంటి పూలతొ ప్రత్యేంగా అలంకరించిన ఊయలో స్వామిఅమ్మవార్లను వేంచేబు చేసి అష్టోత్తరశతనామావళి పూజలు చేశారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

