తిరుమల : తిరుమలలో( Tirumala ) భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆలయ మాఢవీధులు భక్తుల గోవిందా నామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. వివిధ ప్రాంతాల ను౦చి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్ని నిండిపోగా శిలాతోరణం వరకు క్యూ లైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 64,064 మంది తలనీలాలు సమర్పించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.3.80 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.