తిరుమల : వడ్డీకాసులవాడు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పలు ట్రస్టులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad ) కు చెందిన కె.వేంకటేశ్వర్లు ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు ( Pranadana Trust ) కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
తిరుమలలో స్వామివారి అక్టోబర్ నెల దర్శన కోటా విడుదల
ఏడుకొండలస్వామి వెంకన్న కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో అక్టోబర్ నెలకు ( October Month ) సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లయిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కు సంబంధించిన కోటాను ఈనెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, ఈ టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని వివరించారు.