తిరుమల : హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ ( RS Brothers ) రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ బర్డ్ ట్రస్టు ( TTD Bird trust ) కు రూ.4.41 కోట్లు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ పొట్టి వేంకటేశ్వర్లు, డైరెక్టర్లు ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. అదేవిధంగా తిరుపతికి చెందిన శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ సింగపాటి సుబ్బారావు తన కుమారుడు సింగపాటి సాయికృష్ణ పేరుమీదుగా శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
టీటీడీ ఎస్వీ గోశాలకు మగ గుర్రం విరాళం
మదురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ సోమవారం టీటీడీ ఎస్వీ గోశాలకు ఒక మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో వినియోగించనున్నారు. దాత ఈ గుర్రాన్ని టీటీడీ ఎస్వీ గోశాల డైరెక్టర్ ఏ.వి.ఎన్. శివకుమార్‌కు అప్పగించారు. తాజాగా ఎస్వీ గోశాలలో విరాళం ఇచ్చిన గుర్రంతో కలుపుకుని 5 గుర్రాలు ఉన్నట్లు గోశాల డైరెక్టర్ వెల్లడించారు.