కొన్ని అక్షతలు పసుపు గణపతిపై చల్లి నమస్కరించాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు తథాస్తు.
(ఈ కింది విధంగా జపిస్తూ గణనాయకుడికి నమస్కరించాలి)
శ్లో॥ సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః,
ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి.. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
(..అని అనుకొని కొన్ని అక్షతలు పసుపు గణపతిపై వెయ్యాలి.)
ఆసనం సమర్పయామి (పువ్వులను పసుపు గణపతి వద్ద ఉంచి, కింది మంత్రం చదువుతూ నీళ్లు సంప్రోక్షించాలి) హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ఉపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి (దూదితో చేసిన వస్త్రమును లేదా పుష్పాన్ని సమర్పించాలి), గంధాన్ సమర్పయామి (గంధాన్ని చల్లాలి), గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లాలి) పుష్పైః పూజయామి (పుష్పాలను ఉంచాలి) తరువాత గణేశునిపై ఒక్కో పుష్పాన్ని వేస్తూ ఈ కింది మంత్రంతో అర్చించాలి.
ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి.
ధూపం ఆఘ్రాపయామి (అగరుపుల్లలను వెలిగించి స్వామికి ధూపం వెయ్యాలి), దీపం దర్శయామి (దీపాన్ని చూపించాలి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీళ్లు చిలకరించాలి), ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరం వెలిగించాలి)
శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా॥
మహాగణాధిపతియే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతి సుప్రీతః
సుప్రసన్నో వరదో భవతు, మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.
(గణపతి దగ్గరున్న అక్షతలను తీసుకొని తలపై చల్లుకోవాలి).