‘ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిదే! ఇతరుల సేవకు ముందు నడిచే వారే ప్రథములు’ అని క్రీస్తు ప్రబోధించిన ఈ లక్షణాలున్న వ్యక్తికి ఏ సమస్యా రాదు. హృదయంలో గర్వం కలిగిన వారు ధనికులైనా, ఉన్నత పదవుల్లో ఉన్నా.. వాళ్లు ఆధ్యాత్మికంగా పేదవారే!
ఇహలోక సంపదలతో ఉన్నతస్థానంలో ఉన్నా.. ఆత్మీయ సంపదలో లేమిలో ఉంటే వారిని అధములుగా పరిగణించాలని క్రీస్తు బోధ. మనుషులు వారి సంపదలు, కీర్తిని బట్టి కాక.. సహజ గుణ విశేషాలను బట్టి గౌరవం పొందేవారే ధన్యులు అని చెబుతారు ఏసుక్రీస్తు.