తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానానికి ఇద్దరు భక్తులు రూ.30 లక్షలు వివిధ సంస్థలకు విరాళాలు ( Donations ) అందించారు . కదిరికి చెందిన సిద్ధిసాయి రైస్ మిల్ యజమాని కె.వెంకటేష్ శనివారం టీటీడీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు ( Pranadana Trust ) కు రూ.10 లక్షలు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. అదేవిధంగా తిరుపతికి చెందిన లక్కీ4యూ ఎగ్జిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.