తిరుమల : ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ( SV Annaprasadam Trust ) కు రూ.20 లక్షలు గురువారం విరాళం ( Donation ) గా అందింది. హైదరాబాద్‌కు చెందిన దాతలు సంజయ్ బాబు రూ.10 లక్షలు, హోమిపెట్స్ అధినేత హర్షవర్థన్ బాబు రూ.10 లక్షలు చొప్పున విరాళంగా అందించారు.ఈ మేరకు విరాళం చెక్కులను తిరుమలలోని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షలు

టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ప్రాణరక్షక వైద్యసేవలు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ కుటుంబ సభ్యులు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. తమ మనవరాలు కుప్పాల దర్శన పేరుతో అందించిన విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి గురువారం సమర్పించారు.