తిరుమల : తిరుమల (Tirumala ) శ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్కు విరాళంగా అందింది. అశోక్ లేలాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ విప్లవ్ షా రూ.6.60 లక్షల విలువైన అశోక్ లేలాండ్ కంపెనీకి చెందిన సాథీ మినీ ట్రక్కును (Mini truck) అందజేశారు.ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహన తాళాలను ఆలయ ఏఈవో మోహన్ రాజుకు అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ(TTD) డీఐ సుబ్రహ్మణ్యం, అశోక్ లేలాండ్ సేల్స్ హెడ్ శ్రీకాంత్ రాజ పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 59,776 మంది భక్తులు దర్శించుకోగా 22,386 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.24 కోట్లు ఆదాయం(Income) వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వివరించారు.