తిరుమల : శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా అంటూ తిరుమల( Tirumala ) గిరికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు( Compartments) నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 90,011 మంది దర్శించుకోగా 39,083 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.76 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.