తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో(Tirumala )
సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ సెలవుదినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్టుహౌజ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
నిన్న స్వామివారిని 76,289 మంది భక్తులు దర్శించుకోగా 27,586 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.84 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల నుంచి 16 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.