తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 21 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల నుంచి 18 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) అవుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.
నిన్న స్వామివారిని 76,665 మంది భక్తులు దర్శించుకోగా 31,377 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.58 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఉడిపి సోదే వాదిరాజ మఠం ప్రధాన పీఠాధిపతి విశ్వ వల్లభతీర్థ స్వామి బుధవారం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేదమంత్రాల మంత్రోచ్ఛారణల మధ్య ఆయనకు సంప్రదాయ స్వాగతం పలికారు.