ఇతరులతో పోలిక పెట్టవద్దని చెప్పే ఈ నీతి కథ చదివారా?

Comparison | ఒక వ్యక్తి బుద్ధుడి జీవితం గురించి విన్నాడు. తను కూడా బుద్ధుడి అంత ఆధ్యాత్మిక ఔన్నత్యం సాధించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఎందరో గురువులను కలిశాడు. కానీ, వాళ్ల దగ్గర శిష్యరికం అతణ్ని సంతృప్తి పరచలేకపోయింది. ఒకరోజు ‘ఫలానా పర్వత శిఖరాగ్రం మీద ఒక గురువు ఉన్నాడు. ఆయన బుద్ధుడి గురించి సమస్తమూ తెలిసిన జ్ఞాని. నీ ప్రశ్నలేవో ఆయన్ని అడిగావంటే, తప్పక సమాధానాలు దొరుకుతాయి’ అని ఎవరో చెప్పారు. ఆ గురువును వెతుక్కుంటూ ఆయన ఆశ్రమానికి చేరుకున్నాడా శిష్యుడు. ఆశ్రమంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. వారికి పాఠాలు చెబుతున్నాడు గురువు. కొత్తగా వచ్చిన వ్యక్తిని చూసి ‘ఏం కావాలి నాయనా?’ అని అడిగాడు గురువు. ‘నేను బుద్ధుడి బోధనలు సమగ్రంగా తెలుసుకోవాలని తిరుగుతున్నాను. ఇప్పటికే చాలామంది పండితులను కలిశాను. కానీ, వాళ్లెవరూ నా సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేదు. మీరు నా అనుమానాలు నివృత్తి చేయగలరని ఇక్కడికి వచ్చాను’ అన్నాడు శిష్యుడు.
విద్యార్థులందరూ వెళ్లిపోయాక చివరికి కొత్త శిష్యుడి దగ్గరికి వచ్చాడు గురువు. ‘నాతో రా!’ అని పిలిచాడు. గురుశిష్యులు ఇద్దరూ కొండపై నడుస్తూ వెళ్లారు. కొంతదూరంలో వాళ్లకు పచ్చని చెట్లు కనిపించాయి. వాటిని చూపిస్తూ ‘ఇవేమిటో తెలుసా?’ అని ప్రశ్నించాడు గురువు. ‘వెదురు చెట్లు’ అన్నాడు శిష్యుడు. ఆ వెదురు చెట్లకు పక్కగా పుట్టుకొస్తున్న లేత వెదురు రెమ్మలను చూపుతూ ‘ఇప్పుడు వీటిని చూస్తే, నీకెలా కనిపిస్తున్నాయి?’ అని అడిగాడు గురువు. ‘ఆ వెదురు మొక్కలు బాగా పెరిగి, పొడుగ్గా ఉన్నాయి. ఈ వెదురు రెమ్మలు ఇంకా ఎంతో పెరగాల్సి ఉంది. ఇవింకా చిన్నవిగా, పొట్టిగా ఉన్నాయి’ అన్నాడు. ‘ఇవీ వెదుళ్లే!’ అని చెప్పి తన కుటీరం వైపు వెళ్లిపోయాడు గురువు.
జీవితాన్ని యథార్థదృష్టితో చూడాలనుకుంటే పోలికలు పెట్టడం మానుకోవాలి. పోలికల ఆధారంగా ‘ఇది ఉన్నతం, ఇది అథమం, పొడవు, పొట్టి, అందం, వికారం’ అని నిర్ణయించడం సరికాదు. ఏ వస్తువునైనా సమదృష్టితో చూసే అలవాటు ఉండాలి. అదే బుద్ధుడు చూపిన మార్గం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- comparison
- story
RELATED ARTICLES
తాజా వార్తలు
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

