e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home చింతన నిబద్ధతతోనే నిమగ్నత

నిబద్ధతతోనే నిమగ్నత

ఆధ్యాత్మిక పరంగా ఒక అన్వేషకునికి తగిన ‘ధైర్యం, నిబద్ధత’ ఉండాలి. ‘దేవుడు, కర్మ సిద్ధాంతం’ ఈ రెండిటి విషయంలో ఊగిసలాటలు అనవసరం. కొన్నాళ్లు ఒక భావనలో ఉండి, తర్వాత మరొక దానివైపు మళ్లడం ‘పరిపక్వ స్థితి’ అనిపించుకోదు. వీటి మధ్య సమన్వయం సాధించుకోగలిగితే యోగసాధన తేలికవుతుంది. ఒకసారి ప్రసిద్ధ కార్టూనిస్టు, దివంగత శంకరన్‌ పిళ్ళై వైవాహిక జీవితం బెడిసికొట్టే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయన ఒక కౌన్సెలర్‌ వద్దకు వెళ్లాడు. ‘ఆమె నిజంగా మీ నుంచి ఏం కోరుకుంటున్నదో తెలుసుకోండి’ అని ఆయన సలహా ఇచ్చాడు. ఆ మేరకు కొన్ని ఉపాయాలూ చెప్పాడు. తర్వాత, శంకరన్‌ పిళ్ళై ఇంటికి వచ్చేటప్పటికి అతని భార్య అతని వంకైనా చూడకుండా ఒక మహిళా పత్రిక చదువుకొంటున్నది.

అతను, ‘ప్రియా! నీకు తెలివైన మనిషి కావాలా? లేక అందమైన మనిషి కావాలా?’ అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను కొంచెం దగ్గరికి వెళ్లి, పక్కన కూర్చొని, ‘హనీ డార్లింగ్‌! నువ్వు తెలివైన వ్యక్తిని కోరుకొంటున్నావా లేక అందమైన వ్యక్తినా?’ అడిగాడు మళ్లీ. పత్రిక నుంచి చూపు మరల్చకుండానే, ‘ఇద్దరినీ కాదు, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను’ అన్నదామె. ఇదీ అసలు విషయం. ‘ప్రేమ, దోమ అంటూ కూర్చోవడం కన్నా వివాహబంధాన్ని కొనసాగించడమే ముఖ్యం’ అన్న తెలివి ఆమెకు ఉందన్నది దీన్నిబట్టి ఆయనకు స్పష్టమైంది. ఇదే కోణంలో భక్తి సాధనను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది.

- Advertisement -

‘యోగా’ అంటే అన్వేషించడం. ‘నాకు తెలియదు’ అన్న సత్యాన్ని గ్రహించడంతోనే ‘అన్వేషణ’కు పునాది పడుతుంది. దేవుడు, కర్మ సిద్ధాంతం- ఈ రెండిటి విషయంలో మీకు సౌకర్యంగా ఉంది కదా అని, ఏదో ఒక నిర్ధారణకు రాకూడదు. మీ చుట్టూ ఉన్న సమాజంలో, కుటుంబంలో దేవుడిని విశ్వసించే పద్ధతులు సౌకర్యంగానే ఉంటాయి. లేదా దేవుడిని అంతా నమ్ముతారు కాబట్టి, మీరూ నమ్మవచ్చు. ఆ తర్వాత పరిస్థితులు మారితే, దైవభావన ప్రశ్నార్థకమై ‘కర్మ-సిద్ధాంతం’ మొదలుపెడతారు. ఇలా, ఠక్కున మారిపోవడానికి కారణం మీలో ఒక ‘నిబద్ధ అన్వేషకుడు’ లేకపోవడమే. సాధన అంత తేలిగ్గా సిద్ధించేది కాదు. అన్వేషకుడిగా తగిన ధైర్యం, నిబద్ధత మీకు ఉండాలి. ‘పూర్తిస్థాయి అన్వేషకుడి’గా ఉండటమంటే ‘నాకు తెలియదు’ అని అంగీకరిస్తూనే, సాధనలో నిమగ్నం కావడం.‘ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది భగవంతుడా? లేక కర్మ సిద్ధాంతమా?’ అన్న దానిలో స్పష్టత లేకపోతే ఎటూ తేల్చుకోలేని గందరగోళంలో పడతారు.

మిమ్మల్ని నిప్పులు కక్కే డ్రాగన్‌ ఉన్న గదిలో బంధించారని అనుకొందాం. మీరు కాలిపోకుండా ఉంటే, మూడు రోజుల తర్వాత నెమ్మదిగా మీరు ఆ మృగంతో కూడా సంభాషించడం ప్రారంభిస్తారు. దీన్నిబట్టి ఏం అర్థమవుతుంది? సాధనలో మీరు నిండా మునిగి పోకపోవడమే అసలు సమస్య. ‘స్వర్గం-నరకం’, ‘దేవుడు-దెయ్యం’ అనేవి అసలు ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు? మీకు తెలిసినవి- మీ శరీరం, మీ మనస్సు, మీ శక్తి, మీ మనోభావం- వీటిని బాగా ఉంచుకోండి, అది చాలు. ఈ జన్మ తర్వాత మీరు స్వర్గానికి వెళ్లినా, నరకానికి వెళ్లినా, ఆఖరికి ఈ భూమిమీద బాగా జీవించడానికైనా మీరు మంచిస్థితిలో ఉండాలి. శారీరకంగా, మానసికంగా, భావనాపరంగా, శక్తి పరంగా మీరు చక్కటి స్థితిలో ఉన్నప్పుడే అన్వేషణ, సాధన తేలికవుతాయి.

సద్గురు జగ్గీ వాసుదేవ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana