ఓ చెట్టు మీద ఎంతో అందమైన పక్షి ఉంది. అది శాశ్వత సత్యమైన భగవంతుడనే పండును పొడుచుకుని తింటున్నది. భగవన్నామ స్మరణం అనే రసాన్ని తాగి ఆనందిస్తున్నది. దానికి ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఎగరాలనే కోరిక లేదు. తాను ఉన్నచోటనే తృప్తి చెందుతున్నది. అలాంటి పక్షికి ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఎగరడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అలా ఎగురుతూ ఉంటే ఏదో ఒకనాటికి దాని శక్తి ఉడిగిపోతుంది. చివరికి ఎగరడం అనేది దుర్భరంగా మారిపోతుంది. కాబట్టి, ఆ పక్షి భగవంతుడనే మధురఫలం ఉన్న చెట్టునే ఆశ్రయించుకుని ఉండాలి. ఆ చెట్టు ఆకులు ఎన్నటికీ రాలిపోవు ; పైగా దాని కొమ్మలు ఎప్పుడూ తాజా పండ్లతో నిండి ఉంటాయి.