మంగళవారం 11 ఆగస్టు 2020
Devotional - Jun 08, 2020 , 00:54:43

విదుర ‘నీతి’

విదుర ‘నీతి’

కోపం, గర్వం, అసంతృప్తి, దురభిమానం, బద్దకం.. ఇవి దుర్జనుడి లక్షణాలు’

‘మూర్ఖులు తమను ప్రేమించేవారిని ఇష్టపడరు. తమను ప్రేమించనివారి వెనుక పడతారు. తమకంటే అధికుల్ని ఎదుర్కొంటారు’

‘డబ్బు, విద్య, ఉత్తమ వంశం..దుర్బుద్ధి కలిగిన వారికి మదాన్ని కలిగిస్తాయి. ఇవే సజ్జనులకు అణకువనూ, గౌరవాన్నీ తెచ్చి పెడతాయి.’

మహాభారతంలో విదురుడి బోధనలలో సమకాలీన సమాజానికి వర్తించేవీ అనేకం..

‘గొప్ప విలుకాడు వదిలిన బాణం శత్రువుకు తగలవచ్చు, తప్పిపోనూ వచ్చు. కానీ, నేర్పుగలవాడి నీతిమాత్రం ప్రత్యర్థిని నశింపజేస్తుంది’

‘స్నేహం, మాట, బలం, వివాహం, యుద్ధం సమానులైన వారితోనే మంచిది. తమకంటే అధికులతోకానీ, అల్పులతోకానీ శ్రేయస్కరం కాదు’

‘ఎదుటి వాడికి  ఇష్టమైన విషయాలు మాట్లాడగలిగితే మంచిది. అలా కుదరనప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉండటం ఉత్తమం.


logo