శనివారం 15 ఆగస్టు 2020
Devotional - Mar 21, 2020 , 22:39:59

ఎవరు నిజమైన పండితుడు?

ఎవరు నిజమైన పండితుడు?

బాహ్యాలంకరణలతో, బిరుదులు, సత్కారాలతో ఎవరూ నిజమైన పండితులు కాలేరు. ‘యస్యసర్వే సమారంభా: కామసంకల్ప వర్జితా:/ జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తమాహు: పండితం బుధా:’ (శ్రీమద్భగవద్గీత, 19-4). అసలైన జ్ఞానమనే అగ్నితో భౌతిక, తాత్కాలికమైన కర్మఫలితాలను ఎవరు దగ్ధం (విసర్జించడం) చేస్తారో వారే నిజమైన పండితులు. ‘పండ’ అంటేనే వివేకం. ఈ రకమైన వివేకాన్ని ప్రదర్శించేవారే మోక్షార్హులనికూడా శ్రీకృష్ణపరమాత్మ ఉద్బోధించాడు. ఒక పండో, ఆహారమో, ధనమో మనం ఎవరికైనా దానం చేస్తే స్వీకర్త లభించిన దానితో తృప్తి చెందుతాడు. ఇచ్చిన వారికీ మానసిక సంతృప్తి కలుగుతుంది. వీటికీ అతీతంగా కాలాంతర ఫలమూ దక్కుతుంది. మనకీ బుద్ధి కలగడానికి మూలం బీజరూపంలో సిద్ధించిన సంస్కారం. అదే సంకల్పంగా పరిణామం చెంది మనుషులను పండితుల స్థాయికి ఎదిగేలా చేస్తుంది.

- సావధానశర్మlogo