మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 01, 2020 , 18:34:33

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మేడ్చల్‌-మల్కాజిగిరి : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం బొందుగుళ్లకు చెందిన అనిల్‌కుమార్‌(28) మూడుచింతల్‌పల్లి మండలం కొల్తూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని బీఈ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీకి వెళ్తుండగా..ఎదురుగా వస్తున్న కర్కపట్ల జోదాస్‌ కంపెనీకి చెందిన బస్సు ద్విచక్రవాహనంపై వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో అనిల్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, 6 నెలల కొడుకు ఉన్నారు. 


logo