సత్తుపల్లి : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన శనివారం తెల్లవారు జామున మండల పరిధిలోని కిష్టారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఒడిశా రాష్ట్రంలోని కోయడా హరీష్ చందాపూర్ గ్రామానికి చెందిన మంగళ్నాగ్(28) అనే యువకుడు మహాలక్ష్మి క్యాంప్‌లో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి ఒంటిపై దుస్తులు లేకుండా తిరుగుతున్నాడు.
శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన మంగళ్నాగ్ రోడ్డుపై ఉండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో మంగళ్నాగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మహాలక్ష్మి క్యాంప్ ఇన్చార్జ్ షేక్ మహబూబ్ షరీఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.