సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి వెళ్తూ ఇద్దరు రోడ్డు ప్రమాదం మృత్యువాతపడ్డారు. కృష్ణయ్యగూడెం వద్ద ముంబై హైవేపై ఈ ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. మృతులను దొబ్బకుంట తండాకు చెందిన తోప్య, సునీతగా గుర్తించారు. దొబ్బకుంట తండా నుంచి సంగారెడ్డి హాస్పిటల్కు వెళ్తున్న సమయంలో రహదారిపై వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఇద్దరి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.