బహుమతుల ఆశచూపి మహిళకు రూ 3.98 కోట్లకు టోకరా!

ముంబై : వృద్ధ మహిళను రూ 3.98 కోట్లకు మోసగించిన ముగ్గురు నైజీరియన్ కేటుగాళ్లను ఢిల్లీలో పూణే పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితులను జంగో నికోలస్ (29) మండే ఒకెకె (26), పౌలినస్ బంగో (29)లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేట్ కంపెనీలో పనిచేసే బాధిత మహిళ (60)కు గత ఏడాది ఫేస్బుక్ వేదికగా పరిచయమైన నిందితుడు తాను విదేశీయుడినని కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నానని నమ్మబలికాడు.
ఆపై వారు ఫోన్ నెంబర్లు మార్చుకుని వాట్సాప్‌లో చాట్ చేశారు. కొద్దినెలల తర్వాత మహిళ తన బర్త్‌డే వేడుకలు జరుపుకుంటుండగా నిందితుడు తాను ఆమెకు బహుమతిగా హైఎండ్ ఐఫోన్‌ను పంపానని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఇతర చార్జీల కోసం డబ్బులు పంపాలని కోరాడు. ఆ తర్వాత తాను భారత్‌కు రాగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తనను అరెస్ట్ చేశారని తన విడుదల కోసం పెద్దమొత్తంలో డబ్బులు అవసరమని డిమాండ్ చేశాడు.
ఇక ఆపై ఐఫోన్, జ్యూవెలరీ, విదేశీ కరెన్సీ పంపానని వాటికోసం కస్టమ్స్ క్లియరెన్స్ అంటూ లేనిపోని కారణాలు చూపి బాధిత మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బు గుంజాడు. ఆమె ఇచ్చిన డబ్బులు పూర్తిగా తిరిగి ఇస్తానంటూ టోకరా వేశాడు. ఈ బహుమతుల కోసం బాధితురాలు రూ కోటి వరకూ డబ్బును నిందితుల ఖాతాకు తరలించింది. ఇక ఈ బహుమతులను అక్రమంగా తాము పంపడంతో ప్రభుత్వ సంస్ధలు చర్యలు చేపడతాయని వృద్ధ మహిళను బెదిరిస్తూ మరికొంత మొత్తం ఆమె నుంచి రాబట్టారు. నిందితుల ఆగడాలతో విసిగిపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నైజీరియన్ల బాగోతం బట్టబయలైంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- Cyber Crime
- fruad
- Pune
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

