తుపాకీతో బెదిరించి బంగారం, మొబైల్ దొంగిలించాడు..
Ghaziabad | ఎముకలు కొరికే చలిని తట్టుకోలేక ఓ మహిళ ఎండ కోసం తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ దొంగ తుపాకీతో బెదిరించి, ఆమె వద్ద ఉన్న బంగారం, కుమారుడి వద్ద
లక్నో : ఎముకలు కొరికే చలిని తట్టుకోలేక ఓ మహిళ ఎండ కోసం తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ దొంగ తుపాకీతో బెదిరించి, ఆమె వద్ద ఉన్న బంగారం, కుమారుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్‌లోని డీఎల్ఎఫ్ అంకుర్ విహార్ కాలనీలో అశోక్ గుప్తా అనే వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. గుప్తా భార్య గీత.. చలిని తట్టుకోలేక సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ఓ ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. ఒకరు బైక్ దిగి.. తుపాకీతో మహిళను బెదిరించారు. దీంతో ఆమె వద్ద ఉన్న బంగారం ఇచ్చేసింది. పక్కనే ఉన్న కుమారుడిని కూడా బెదిరించి, అతని వద్ద మొబైల్‌ను దొంగిలించారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బాధితురాలు గీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులు టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్లదాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

