Cyber Fraud | ఫేస్బుక్లో ఐపీఎల్ టికెట్లు కొనుగోలు చేస్తూ రూ. 86,000 పోగొట్టుకున్న మహిళ
సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ అడ్డాగా అమాయకులను రోజుకో తరహా స్కామ్‌తో ముంచేస్తున్నారు. లేటెస్ట్గా బెంగళూర్‌కు చెందిన ఓ మహిళ (43) ఆన్లైన్ స్కామ్‌లో ఐపీఎల్ టికెట్లను కొనుగోలు చేస్తూ రూ. 86,000 పోగొట్టుకున్నారు.
Cyber Fraud : సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ అడ్డాగా అమాయకులను రోజుకో తరహా స్కామ్‌తో ముంచేస్తున్నారు. లేటెస్ట్గా బెంగళూర్‌కు చెందిన ఓ మహిళ (43) ఆన్లైన్ స్కామ్‌లో ఐపీఎల్ టికెట్లను కొనుగోలు చేస్తూ రూ. 86,000 పోగొట్టుకున్నారు. ఫేస్బుక్లో ఐపీఎల్ క్రికెట్ టికెట్ అనే ఖాతా కనిపించగా ఆమె ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు కొనుగోలు చేయాలని ప్రయత్నించారు. ముందుగా అది సరైనదేనా అని నిర్ధారించుకోకుండా ఆమె టికెట్లు కొనుగోలు చేసేందుకు ముందుకెళ్లడంతో పెద్దమొత్తంలో డబ్బు పోగొట్టుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌ను వీక్షించాలనుకున్న మహిళ ఆన్లైన్లో టికెట్ల కోసం ప్రయత్నించగా ఐపీఎల్ క్రికెట్ టికెట్ అనే ఖాతా టికెట్స్ విక్రయిస్తోందని గమనించింది. సదరు ఖాతాలో పేర్కొన్న నెంబర్‌కు ఆమె కాల్ చేయగా, తాము ఐపీఎల్ టికెట్స్ విక్రయిస్తామని అవతలి వ్యక్తి నమ్మబలికాడు. తనకు 20 టికెట్స్ కావాలని మహిళ అతడికి వివరించారు. టికెట్లను బుక్ చేసేందుకు రూ. 8000 అడ్వాన్స్ చెల్లించాలని కోరగా అందుకు ఆమె అంగీకరించి ఆ మొత్తాన్ని అతడి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసింది.
ఆపై మరో 11,000 చెల్లించాలని కోరగా ఆ మొత్తాన్ని ఆమె పంపింది. అటు తర్వాత ఏదో ఒక పేరుతో రూ. 15,000, రూ. 21,000 వసూలు చేశాడు. తాను మోసపోతున్నానని గ్రహించని మహిళ అతడిని నమ్మి వివిధ లావాదేవీలతో ఏకంగా రూ. 86,000 పంపింది. ఆపై మళ్లీ డబ్బులు అడగడంతో తనకు టికెట్స్ పంపాలని, లేదా తాను చెల్లించిన మొత్తం వెనక్కిఇవ్వాలని కోరింది. నిందితుడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Road accident | శుభకార్యానికి వెళ్లొస్తుండగా విషాదం.. బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- cyber fraud
- ipl
- loses
- money
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

