వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తతో గొడవే కారణమా?

పెనుబల్లి: మండలపరిధిలోని వీఎం.బంజరుకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వీఎం. బంజరుకు చెందిన వంగా బాలమురళీకృష్ణ-వనజ భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున వనజ మృతి చెందింది.
దీంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న వనజ తల్లిదండ్రులు తమ కూతురు మృతి పట్ల అనుమానాలున్నాయని, అల్లుడు బాలమురళీకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు వీఎం.బంజర ఎస్ఐ తోట నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

