అమరావతి : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వీఆర్ పేటలో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య చిన్నపాటి ఘర్షణతో ఆవేశానికి లోనైన భార్య సత్యవతి భర్త గంగునాయుడు ముఖంపై వేడినూనె పోసి తీవ్రంగా గాయపరిచింది.
దీంతో అతడి పరిస్థితి విషమంగా మారడంతో దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు భార్య సత్యవతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.