ఐదు నెలల గర్భిణిని గొడ్డలితో నరికి చంపిన భర్త
కామారెడ్డి : మద్యానికి బానిసైన ఓ భర్త ఆ మత్తులోనే భార్యను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఐదు నెలల గర్భిణి అని కూడా చూడకుండా.. విచక్షణారహితంగా గొడ్డలితో నరికి చంపాడు. దారుణ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
చిట్యాలకు చెందిన సంజీవులు మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో భార్య రమ్యతో తరుచూ గొడవ పడుతున్నాడు. గురువారం ఉదయం కూడా భార్య రమ్యతో గొడవ పడ్డాడు. రమ్యపై గొడ్డలితో దాడి చేసి విచక్షణారహితంగా నరికాడు. భార్యను నరికిన గొడ్డలితోనే భర్త సంజీవులు తన తలపై నరుక్కున్నాడు. అంతటితో ఆగకుండా పొలం వద్ద ఉన్న తండ్రిపై అదే గొడ్డలితో దాడి చేసేందుకు సంజీవులు బయల్దేరాడు. సంజీవులును అడ్డుకునేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా, వారిపై కూడా దాడి చేసేందుకు యత్నించాడు. పొలం వద్దకు వెళ్తూనే గ్రామ శివారులో స్పృహ కోల్పోయి పడిపోయాడు సంజీవులు. గ్రామస్తులు అప్రమత్తమై అతన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంజీవులు మృతి చెందాడు. హత్యకు గురైన రమ్య ఐదు నెలల గర్భిణి. ఇప్పటికే ఈ దంపతులకు ఏడాదిన్నర పాప ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

