
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీ ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షేక్ ఖాజామియా అనే ఖైదీ (35) జైలు ఆవరణలోని సంజీవని దవాఖానలో టవల్‌తో కిటికీకి ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. గత 17 రోజుల క్రితం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో షేక్ ఖాజామియాను మల్కాజ్గిరి కోర్టు నిందితుడిగా తేల్చి రిమాండ్ విధించింది. దీంతో చర్లపల్లి సెంట్రల్ జైలులో అతడు శిక్ష అనుభవిస్తున్నాడు. ఖాజామియా స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ. ఆత్మహత్యను జైలు అధికారులు ధ్రువీకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.