అమరావతి : తమిళనాడులోని రామేశ్వరం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు 5 గురు అయ్యప్పను దర్శించుకుని వస్తుండగా రామేశ్వరం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో నవీన్(24), సాయి(25) మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. అయ్యప్ప భక్తుల మృతి పట్ల పలాస ఎమ్మెల్యే శిరీష సంతాపం తెలిపారు. సహాయ చర్యల కోసం సమాచారాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌కు వివరించారు.