చెన్నై : తనతో సన్నిహిత సంబంధం నెరిపేందుకు నిరాకరించడంతో 19 ఏండ్ల బాలికను ఫ్రెండ్ సాయంతో వ్యక్తి కిడ్నాప్ చేసిన ఉదంతం తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగుచూసింది. బాలిక బుధవారం ఇంటికి తిరిగివస్తుండగా నిందితుడు అతడి స్నేహితుడితో కలిసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. బాలిక వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని సమీపంలోని ఓ ఇంటిలో తలదాచుకుంది.
తల్లితండ్రులకు సమాచారం చేరవేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపై పోలీసులు బాలిక ఆశ్రయం పొందిన ఇంటికి వెళ్లి ఆమెను కాపాడారు. ఇద్దరు నిందితులను దినేష్, ఇమ్రాన్‌లుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దినేష్ ప్రతిపాదనను బాలిక తిరస్కరించడంతో తన ఫ్రెండ్ ఇమ్రాన్ సహకారంతో నిందితుడు ఆమెను కిడ్నాప్ చేసే ప్లాన్‌కు తెరలేపాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు.